telugu navyamedia
తెలంగాణ వార్తలు

వనమా రాఘవకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పాల్వంచలోని నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ-2 నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ టిఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్​ విధించింది.

దమ్మపేట మండలం మందలపల్లి లో ఏపీ సరిహద్దు ప్రాంతం చింతలపూడి మధ్య శుక్రవారం అర్ధ‌రాత్రి వనమా రాఘవను అదుపులోకి తీసుకున్నారు. ఆనంత‌రం అనంతరం వైద్య పరీక్షలు చేసి కొత్తగూడెం మెజిస్ట్రేట్‌ ముందు పోలీసులు హాజరుపరిచారు. విచారణ అనంతరం రాఘవకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్​ విధించింది. వనమా రాఘవను భద్రాచలం సబ్‌ జైలుకు పోలీసులు తరలించారు.

Bhadradri Kottagudem Vanama Raghava Sent To 14 Days Judicial Remand | Vanama Raghava: వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్... రామకృష్ణను బెదిరించినట్లు అంగీకరించిన రాఘవ... ఏఎస్పీ రోహిత్ ...

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం పాల్వంచ‌లోని రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం తానేన‌ని వ‌న‌మా రాఘ‌వ పోలీసుల ముందు ఒప్పుకున్నాడ‌ని ఏఎస్పీ రోహిత్ తెలిపారు.. రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌, వ‌న‌మా రాఘ‌వ కేసుకు సంబంధించి మీడియా స‌మావేశంలో మాట్లాడిన రోహిత్.. వ‌న‌మా రాఘ‌వ‌పై ఈ కేసుతో పాటు మొత్తం 12 కేసులు ఉన్నాయని ఏఎస్పీ మీడియాకు వెల్లడించారు.

రాఘవేంద్రకు సహకరించిన చావా శ్రీనివాస్, రమాకాంత్ లకు నోటీసులు ఇచ్చామని.. వారు స్పందించకపోతే చట్టప్రకారం చర్యలు చేపడతామని అన్నారు. ఇతర కేసులపై కూడా విచారణ కొనసాగుతోందని… త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.

Related posts