telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వీళ్ళు మారరు…. ఆ స్టేజ్ దాటిపోయింది…

tamil

తమిళ హీరో విజయ్ బర్త్ డే మరో రెండు నెలల్లో ఉంది. అయితే ఈలోపే కొందరు నెటిజన్స్ జూన్ 22 విజయ్ డేత్ డే అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్ సెట్ చేశారు. అయితే అంతకుముందు కూడా విజయ్ పై ఇతర హీరోల ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ పెట్టడం ట్రోల్ చేయడం లాంటివి చేశారు. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని నిరంతరం అభిమానులు సోషల్ మీడియాలో దాడులు చేసుకుంటూనే ఉంటారు. కొన్ని సార్లు బహిరంగాను వీరు దాడులకు దిగుతుంటారు. మేమంతా బాగానే ఉంటాం మీరు కొట్టుకోవద్దని హీరోలు చాలా సందర్భాల్లో చెప్పిన అభిమానులు మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఇక కోలీవుడ్ లో ఈ పిచ్చి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అక్కడ తమ అభిమాన హీరోలకు, హీరయిన్లకు విగ్రహాలు కట్టి మరి ఆరాధిస్తారు. నిత్యం విజయ్ – అజిత్ అభిమానులు ప్రతి విషయం లోను పోటీ పడుతుంటారు.

Related posts