telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ నూతన గవర్నర్ గా సీపీ రాధా కృష్ణన్ గారు ప్రమాణస్వీకారం.

తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2024 మార్చి 20వ తేదీ ఉదయం 11:15 నిమిషాలకు రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణస్వీకారోత్సవం జరిగింది.

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదె గారు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.

సీపీ రాధాకృష్ణన్ కు  తెలంగాణతో పాటుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గానూ బాధ్యతలు అప్పగించారు.

2023 ఫిబ్రవరి నుంచి సీపీ రాధకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు.

తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ 16 ఏండ్లకే ఆర్ఎస్ఎస్ లో చేరారు. జన్ సంఘ్, బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 1998, 1999లో బీజేపీ ఎంపీగా గెలిచి..

2004, 2009, 2019లో ఓడిపోయారు. తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా పని చేశారు. గత సంవత్సరం  ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు.

తెలంగాణ మొదటి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ 2014 నుంచి 2019 వరకు పని చేయగా, ఆయన తర్వాత 2019 సెప్టెంబర్ నుంచి 2024 మార్చి వరకు తమిళిపై పని చేశారు.

Related posts