జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌటింగ్ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదు దఫాలుగా పోలింగ్ జరిగింది. మొదటి దశలో 13 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న, రెండో దశలో 20 స్థానాలకు డిసెంబర్ 7న, మూడో దశలో 17 స్థానాలకు డిసెంబర్ 12న, నాలుగో దశలో 15 స్థానాలకు డిసెంబర్ 16న, ఐదో దశలో 16 స్థానాలకు డిసెంబర్ 20న పోలింగ్ జరిగింది.
ప్రస్తుత సమాచారం ప్రకారం మొత్తం 52 స్థానాల్లో ఆధిక్యాలు వెల్లడయ్యాయి. బీజేపీ అత్యధికంగా 18 స్థానాల్లో ముందంజలో ఉండగా, ఝార్ఖండ్ ముక్తి మోర్చా గట్టి పోటీని ఇస్తూ, 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో ఏజేఎస్యూ 4 జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా 42 ఎమ్మెల్యేలు అవసరం.
ప్రజా ప్రభుత్వం పోయి.. ఫాసిస్ట్ ప్రభుత్వం వచ్చింది: యనమల