telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జయలలిత బయోపిక్స్ కు మద్రాస్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

Thalaivi

కోలీవుడ్ లో దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితం ఆధారంగా పలు చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా… అందులో జయలలితకు సంబంధించిన ఒక బయోపిక్ లో బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ప్రధాన పాత్రలో చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. “త‌లైవీ” అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాను విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అదే విధంగా దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్‌ లేడీ’ పేరుతో జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో జయలలితగా నటి నిత్యామీనన్‌ నటించనుంది. ఇక ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో క్వీన్ పేరుతో గౌత‌మ్ మీన‌న్ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నాడు. అయితే జ‌య‌ల‌లిత బ‌యోపిక్ చిత్రాలు అడ్డ‌కుంటాన‌ని జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీప జ‌య‌కుమార్ ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది . అంతేకాదు చిత్ర రిలీజ్ ఆపేందుకు మ‌ద్రాస్ హైకోర్ట్‌ని కూడా ఆశ్ర‌యించింది.దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు పిటీష‌న్‌ని తిర‌స్క‌రించింది. జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న అన్ని ప్రాజెక్టుల‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీప‌ని పోలిన ఏ పాత్ర‌ని చిత్రంలో ఉంచ‌కూడ‌ద‌ని కోర్టు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కి తెలియ‌జేసింది

Related posts