యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ తనయ శివాత్మిక ఇప్పటికే “దొరసాని” అనే చిత్రంతో వెండితెరకి పరిచయమైంది. అయితే ఈ సినిమా ఆమెకు అనుకున్నంత గుర్తింపును ఇవ్వలేకపోయింది. తాజా సమాచారం ప్రకారం శివాత్మిక మరో సినిమాకి సైన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ బ్యూటీ సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలలో “రంగమార్తాండ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రమ్య, ప్రకాశ్ రాజ్ కూతురి పాత్రలో శివాత్మిక కనిపించనుందట. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా సెట్స్ పైకి వెళ్లింది. విశాఖపట్నంలో చిత్ర షూటింగ్ జరుపుకుంటుంది. చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన రోల్ హృదయాలని పిండేసేలా ఉంటుందట. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇక “దొరసాని” విషయానికొస్తే… విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం నిజ జీవితానికి దగ్గరగా ఎంతో రియలిస్టిక్‌గా రూపొందింది. తెలంగాణ దొర ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా శివాత్మిక తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది.