telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ : .. గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ .. నామినేటేడ్‌ ఛైర్మన్ల తొలగింపు..

library nominated chairmen changed in AP

రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌తోపాటు, జిల్లాల్లో నియమించిన నామినేటేడ్‌ ఛైర్మన్లను తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధిం చిన జీవో 246ను పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి రాజశేఖర్‌ జారీ చేశారు. ఏపీ గ్రంథాలయ పరి షత్‌ ఛైర్మన్‌గా దాసరి రాజా మాస్టర్‌ను, సభ్యులుగా రావి శారద, సుర సుధాకర్‌ రెడ్డి, గొట్టపు వెంకట నాయుడు, నల్లమిల్లి వీర్‌ రెడ్డి, ఎన్‌ లలిత, ఎస్‌కె పీర్‌ అహ్మద్‌ను గత ప్రభుత్వం నియమించింది. రావి శారద రాజీనామాను ఆమోదించింది. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్లుగా ఉన్న వారిని కూడా తొలగిస్తున్నట్లు 244 జీవో విడుదల చేసింది.

విశాఖపట్నం జిల్లా మినహా అన్ని జిల్లాల్లో నామి నేటెడ్‌ పదవుల్లో ఉన్న వారిని తొలగిస్తున్నట్లు పేర్కొంది. కొత్త ఛైర్మన్‌ను నియమించే వరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఇన్‌ఛార్జి రాష్ట్ర గ్రంథాలయ సంస్థకు ఛైర్మన్‌గా ఉంటారని జీవో 247ను విడుదల చేసింది. జిల్లాల్లో విద్యకు సంబంధించిన బాధ్యతలు చూస్తున్న జాయింట్‌ కలెక్టర్‌-2 జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్‌ఛార్జి ఛైర్మన్లుగా ఉంటారని జీవో 248 ద్వారా వెల్లడించింది. విశాఖపట్నం మినహా 12 జిల్లాలకు వీరే ఉంటారని స్పష్టం చేసింది.

Related posts