telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విలన్‌ పాత్రలో బాలయ్యని ఓ రేంజ్ లో చూపించబోతున్న బోయపాటి

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ నుంచి చిత్రానికి సంబంధించిన అనేక వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో డ్యుయల్‌ రోల్‌ పోషిస్తున్న బాలయ్య ఓ పాత్రలో భాగంగా విలన్‌ పాత్రలో కనిపిస్తాడని టాలీవుడ్‌ హాట్‌ టాపిక్‌. ఈ సినిమాలో విలన్‌ పాత్రను బలంగా రూపొందిస్తున్నారట బోయపాటి. అయితే బాలయ్య వంటి హీరోను ఢీ కొట్టడానికి అవతల కూడా బాలయ్యనే ఉండాలని దర్శకుడు భావిస్తున్నాడట. దర్శకుడి ఆలోచనకు ఈ నందమూరి హీరో కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తల వచ్చాయి. ఇక ఈ చిత్రంలో భూమిక చావ్లా పవర్‌ఫుల్‌ లేడీ విలన్‌ పాత్ర పోషిస్తున్నారని మరో వార్త ప్రచారంలో ఉంది. అయితే ఈ చిత్రంలో విలన్‌ పాత్ర గురించి స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య సరసన అంజలి, శ్రియాలను చిత్ర బృందం ఎంపిక చేసిందని సమాచారం.

Related posts