telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బోల్డ్ సీన్లకు భారీగా డిమాండ్ చేస్తున్న రమ్యకృష్ణ

Ramya-Krishna

రమ్యకృష్ణ ప్రస్తుతం భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా చేస్తుండగానే ‘ అంధాదున్’ తెలుగు రీమేక్‌లో ఆమెకు ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. హిందీలో వచ్చిన అంధాదున్ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా, ఆయనకు సరితూగే పాత్రలో టబు నటించింది. బోల్డ్ అండ్ నెగెటివ్ రోల్ పోషించిన టబు ఈ మూవీ విజయంలో కీలక భూమిక పోషించింది. దీంతో అంధాదున్ తెలుగు రీమేక్ లోనూ టబునే ఫైనల్ చేయాలని ప్లాన్ చేశారు కానీ ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేయడంలో వెనక్కితగ్గి ఆ క్యారెక్టర్ని రమ్యకృష్ణ చేత చేయించాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు రమ్యకృష్ణను సంప్రదించి ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే రమ్యకృష్ణ కూడా ఈ బోల్డ్ క్యారెక్టర్ చేసేందుకు భారీగానే డిమాండ్ చేసిందని లేటెస్ట్ టాక్. ఠాగూర్ మధు సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అంధాదున్’ తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తున్నాడు.

Related posts