telugu navyamedia
సినిమా వార్తలు

ప్రియా వారియర్ కు బెదిరింపులు… దునియా మొత్తం నీ న్యూడ్ లైఫ్ చూస్తుంది…

SRIDEVI BUNGALOW

కన్నుగీటి పాపులారిటీ దక్కించుకున్న స్టార్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం బాలీవుడ్ లో “శ్రీదేవిబంగ్లా” అనే సినిమాలో నటించింది. ప్రశాంత్ మాంబుల్లి వహిస్తున్న ఈ సినిమా నుంచి చాలాకాలం క్రితమే ట్రైలర్ ను విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో శ్రీదేవి అనే పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ రీల్ లైఫ్ హీరోయిన్ గా కనిపించనుంది. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్-2 అంటూ మరో టీజర్ ను విడుదల చేశారు. ”నాకు ఎంత మంది ప్రపోజ్ చేశారో నీకు తెలుసా..?” అంటూ ప్రియా ప్రకాష్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది. అయితే ఓ వ్యక్తి మాత్రం “దునియా మొత్తం నీ న్యూడ్ లైఫ్ చూస్తుంది” అని ప్రియాని ఓ వ్యక్తి బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే బాలీవుడ్ నిర్మాత, దివంగత శ్రీదేవి భర్త బోణీకపూర్ ఈ ట్రైలర్ చూసి నటి ప్రియా ప్రకాష్ వారియర్, సినిమా దర్శకుడు ప్రశాంత్ మాంబుల్లిలకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయంపై స్పందించిన దర్శకుడు ప్రశాంత్ శ్రీదేవి అన్నది సాధారణంగా అమ్మాయిలు పెట్టుకునే పేరు అని, ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ కథ అని, ఏదేమైనా కేసుని ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

Related posts