telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చదువుల తల్లి…

పుట్టిన ఆడబిడ్డలెల్ల
చదువుల తల్లులే
అవనిలో అందాల బొమ్మలే
భావితరానికి కళల కానాచిలే
వీణ పట్టి మీటినా
గళము నెట్టి పాడినా
గానకోకిలై పలకరించినా
ఘల్లుఘల్లుమని నర్తించినా
కలము పట్టి కవితలే కుార్చినా
కుంచెపట్టి రంగుల రమ్యమై చిత్రించినా
వంట ఇంటి ఆటలాడినా
సకల ప్రావీణ్యతల చేతబట్టినా
చిట్టి తళ్లులే సరస్వతి పుత్రికలై
ఇలలో వెలసిన చిట్టిదేవతలే
లక్ష్మీకళల పుాభోణిలే
రమణీయ హృదయ చిరునవ్వులే
కాలెట్టినారు ఇంటింట
వనితలై తల్లులై ఆడబిడ్డలై
మది బాధనంత తీర్చ నిలిచినారు
కన్నుల ముందు కనిపించే దేవతలే
కనిపించని దేవతలై జగతిలో!..

Related posts