telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

మాస్క్‌ను ఉతుకుతున్నారా.. అయితే ఈ భయకరంమైన నిజాలు తెలుసుకోండి !

ఎలాంటి మాస్కులు వాడుతున్నాం అనే దాని కంటే ఎంత శుభ్రంగా వాటిని వాడుకుంటున్నాం? అనేది ముఖ్యం. ఫేస్‌ మాస్క్‌ను అదే పనిగా వారం రోజులు వాడి, ఆ తర్వాత ఉతికేస్తూ ఉంటారు. ఇది సరికాదు. ప్రతి రోజూ వీటిని శుభ్రం చేసుకోక తప్పదు. అన్ని రకాల మెటీరియల్స్‌తో తయారయ్యే మాస్కులన్నింటికీ ఈ నియమం వర్తిస్తుంది. ఎన్‌ 95 మాస్క్‌ కేవలం నాలుగు సార్లు ఉపయోగించడానికి మాత్రమే ఉద్దేశించినది. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు దాన్ని వాడకుండా పక్కన పెట్టి, నాలుగు రోజుల తర్వాత తిరిగి వాడుకోవాలి. అలా వాడకుండా ఉంచిన సమయంలో ఆ మాస్క్‌కు ఉన్న యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాల కారణంగా తిరిగి మరో నాలుగు రోజులు వాడుకోవడానికి అది సిద్ధమవుతుంది. మిగతా మాస్క్‌లను సున్నితమైన సబ్బు నీటితో మాత్రమే శుభ్రం చేసుకోవాలి. ఘాటైన సబ్బులు, వాషింగ్‌ పౌడర్లు వాడడం సరికాదు. కాబట్టి వీటినే ఎంచుకోవడం మేలు. మాస్క్‌ రోజంతా ధరించేవారు ముక్కు దగ్గరి చర్మం గీసుకుపోకుండా, మెత్తని టిష్యూ పేపర్‌ను మాస్క్‌ ముక్కుకు తగిలే భాగంలో ఉంచి, దాని పైన మాస్క్‌ ధరించాలి. మాస్క్‌ వాడకంతో మొటిమల సమస్య ఎదుర్కొనేవారు సాలిసిలిక్‌ యాసిడ్‌తో తయారైన క్రీమ్‌ రాత్రివేళ వాడుకోవాలి.

Related posts