telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆశయం…

మనసుకు సంకెళ్ళు వేసుకుని,

కాళ్లను బంథీని చేసి,

కార్యరూపం దాల్చకుండా,

కర్తవ్యం నిర్వహించకుండా,

సజావుగా సాగిపోతుందిలే అనుకుని,

కళ్ళు మూసుకుని కూర్చుంటే నష్టాలు జరుగక పోవచ్చు.. కానీ,విలువైన కాలాన్ని తీసుకురాలేము..

జరిగిన నష్టాన్ని అంచనా వేయలేము..

ఎవరో వస్తారని, ఏదో చేస్తారని,

ఎదురు చూసి నిలిచిపోకు మిత్రమా !

నీలాగా ఆలోచించి పనిని పూర్తి చేయగల సమర్థులు నీకన్నా ఇంకెవ్వరూ లేరీలోకంలో…

కొత్తగా ప్రయత్నిస్తున్న సమయంలో,

అనేక కష్టనష్టాలు ఎదురుకావచ్చు…

సవాలుగా తీసుకుని ముందుకు సాగిపో…

విజయం నిన్ను తప్పక వరిస్తుంది…

అబ్రహం లింకన్ కూడా పలుమార్లు ప్రయత్నిస్తేనే,

అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు…

తన కలను సాకారం చేసుకున్నాడు…

 

 

Related posts