telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజా అంటూ మీరు పిలిచే పిలుపులో ఆత్మీయత… : చిరంజీవి

chiru

మూవీ మొఘల్, ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు అన్ని భారతీయ భాషల్లోనూ సినిమాలు నిర్మించి ఎవరికీ సాధ్యం కాని రికార్డులను నెలకొల్పారు. నిర్మాత అనే పదానికి పర్యాయపదంగా నిలిచిన రామానాయుడి జయంతి నేడు (శనివారం). ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. రామానాయుడిని గుర్తు చేసుకున్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. “రాజా అంటూ మీరు పిలిచే పిలుపులో ఆత్మీయత చవి చూసాను. కారంచేడు నుంచి వచ్చిన ఓ కుర్రాడు.. దేశం గర్వించేలా అన్ని భారతీయ భాషల్లోనూ చిత్రాలు నిర్మించటమే కాదు.. నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పటం తెలుగు వారందరికీ గర్వకారణం. సినిమా అంటే మీకున్న ప్రేమ, మీరు చేసిన సేవలు ఈ తరానికి చిరస్మరణీయం` అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.

Related posts