telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

భారీ ఆఫర్ పట్టేసిన రకుల్ ప్రీత్ సింగ్…

Rakul-PReeth-Singh

తెలుగు సినిమా పరిశ్రమలోకి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో అడుగు పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా హిట్ కావడంతో తరువాత వరసగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోయింది. ఒక్క తెలుగుపై మాత్రమే కాకూండా.. మిగతా ఇండస్ట్రీలపై కూడా కన్నేసింది ఈ అమ్మడు. తెలుగు, తమిళ్, కన్నడ, అటు హిందీ పరిశ్రమలో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ చిన్నది. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది రకుల్. ఇక రకుల్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈ చిన్నది బాలీవుడ్ లో చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి. దాంతో తెలుగు సినిమాలే చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో రకుల్ కు క్రేజీ ఆఫర్ వచ్చింది. ఏకంగా బిగ్ బీ అమితాబ్ సినిమాలో అమ్మడికి నటించే ఛాన్స్ దక్కింది.  అమితాబ్ , అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో మేడే అనే సినిమా తెరకెక్కనుంది. థ్రిల్లర్ కథాంశం తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ పైలెట్ గా కనిపించనుంది.  ఈ సినిమా తో అమితాబ్ తో నటించాలన్న తన కల నిజమైందని సంబరపడుతుంది రకుల్ . ఈ సినిమా 2021 లో రిలీజ్ చేయాలనీ దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

Related posts