పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతూనే ఉన్నాయి. రోజు రోజులు డ్రగ్స్ ముఠాల ఆగడాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా.. హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. శివారు ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై డీఆర్‌ఐ ఇవాళ దాడి చేసింది. ఈ దాడిలో 250 కిలోల మెపిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ముంబై కేంద్రంగా నడుస్తున్న ఈ డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో రా మెటిరీయల్స్‌ను తయారు చేస్తున్న ఈ ముఠా… హైదరాబాద్ నుంచి ముంబైకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నది. మెపిడ్రిన్‌తో ఎండీఎంఏ, కొకైన్, అంపెటమిన్ అనే వివిధ రకాల డ్రగ్స్ ను తయారీ చేస్తోంది ఈ ముఠా. మియావ్ మియావ్ డ్రోన్ పేర్లతో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నారు. సిటీలోని కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఈ ముఠా విచ్చల విడిగా డ్రగ్స్‌ను అమ్ముతోంది. తాజాగా హైదరాబాద్‌లో 4 చోట్ల డీఆర్‌ఐ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
previous post
next post
ఆ స్టార్ హీరో సెట్లోనే నాతో చాలా దారుణంగా వ్యవహరించారు : హీరోయిన్