telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఎంసెట్ షెడ్యూల్ ఖరారు…

ఈ ఏడాది ఎంసెట్ షెడ్యూల్ ఖరారైంది. జులై 5 నుండి 9 వరకు ఎంసెట్ ఎంట్రెన్స్ పరీక్షలు జరగనున్నాయి. జేఎన్టీయూ ఈ పరీక్షలు నిర్వహించనుంది. ఈ సారి ఇంటర్ ప్రథమ సంవత్సరం మొత్తం సిలబస్, ద్వితీయ సంవత్సరం 70 శాతం సిలబస్ తోనే ఎంసెట్ ఎంట్రెన్స్ జరగనుంది. జులై 3 న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నేపథ్యంలో ఎంసెట్ లో మొదట జులై 5,6 తేదీల్లో అగ్రికల్చర్ స్ట్రీమ్ ..జులై 7,8,9 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంట్రెన్స్ టెస్ట్ జరగనుంది. సిలబస్ తగ్గించిన నేపథ్యంలో పరీక్ష విధానం లో మార్పులు చేయొద్దనే ఆలోచన లో సెట్ కమిటీ ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే గతంలో మాదిరిగా ప్రశ్న పత్రం ఉండనుంది. అయితే ఈ ఏడాది తెలంగాణలో పరీక్ష కేంద్రాలు పెరగనుండగా.. ఏపీలో తగ్గనున్నాయి. అయితే ఈ ఏడాది కూడా పరీక్షా టైమ్ లో ఎలాంటి మార్పులు లేవు. ఉదయం 9 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నాం 3 నుండి 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. చూడాలి మరి ఈ పరీక్షలు ఎవరు పై చేయి సాధిస్తారు అనేది.

Related posts