telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన డాక్టర్లు!

doctors stike bengal

పశ్చిమ బెంగాల్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యులపై ఈ నెల 10న జరిగిన దాడిని నిరసిస్తూ వైద్యులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని వైద్యులు శుక్రవారం విధులు బహిష్కరించి వారికి మద్దతు ప్రకటించారు. మరోవైపు జూడాలపై దాడికి నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా సమ్మె చేసేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. డాక్టర్ల సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చింది. కోల్ కతాలో జూనియర్ డాక్టర్లపై దాడులకు నిరసనగా ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్టు ఐఎంఏ వర్గాలు తెలిపాయి.

డాక్టర్ల డిమాండ్లను సీఎం మమతా బెనర్జీ పట్టించుకోకపోగా, అల్టిమేటం జారీ చేశారు. విధులకు హాజరుకాని పక్షంలో హాస్టళ్ల నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. దాంతో జూడాలు మరింత రెచ్చిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను కొనసాగించారు. అంతేకాకుండా, విధులకు హాజరైన కొందరు జూడాలు హెల్మెట్లు ధరించి వైద్యం చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.ఢిల్లీ సహా ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర ప్రధాన నగరాల్లో వైద్యులు ఒక్క రోజు విధులు బహిష్కరించి బెంగాల్‌ డాక్టర్లకు మద్దతు ప్రకటించారు.

Related posts