భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మిరియాలను వంటింటి దినుసులుగా ఉపయోగిస్తున్నారు. మిరియాలలో అనేక అద్భుత ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా వాటితో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
* అల్లం రసం, తులసి ఆకులు, దాల్చినచెక్క పొడి, మిరియాల పొడి వేసి చేసిన గ్రీన్ టీ తాగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు.
* కొన్ని మిరియాలను తీసుకుని వాటిని రెండు తమలపాకుల్లో పెట్టుకుని నిత్యం నమిలి మింగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు.
* ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ మిరియాల పొడిని కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగితే అధిక బరువు తగ్గుతారు.
* అరకప్పు మోతాదులో పుచ్చకాయ, పైనాపిల్ జ్యూస్‌లను తీసుకొని వాటిని కలిపి అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని నిత్యం ఉదయాన్నే తాగితే ఎంత లావున్నా తగ్గాల్సిందే.
* మార్కెట్‌లో దొరికే బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను తీసుకుని అందులోంచి ఒక చుక్క ఆయిల్‌ను ఒక గ్లాస్ నీటిలో కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగినా శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.