telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

బెల్లంతో.. బరువు తగ్గొచ్చు… తెలుసా..

jaggery and its health benefits

మొదటి నుండి మన పెద్దలు బెల్లం తినేవారు. కానీ మనం ఆకర్షణగా ఉండే పంచదారకు అలవాటు పడ్డాము. ఆ ఆకర్షణ తెచ్చిపెట్టిన రోగాలతో మళ్ళీ ఇప్పటికి కళ్ళుతెరుచుకుంటున్నాం.. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మన పెద్దల ఆహారంపై పరిశోధన జరిపి, వారు ఏమి తింటున్నారో తెలుసుకొని, అవే తినడానికి సిద్ధం అవుతున్నాం. అప్పటిలో బెల్లం తీసుకోవడం ఎక్కువ, ఆరోగ్య ప్రయోజనాలు కూడా అలాగే ఉండేవి. అందుకే ఇప్పుడు మళ్ళీ అందరి ద్రుష్టి బెల్లం వైపు మళ్లుతుంది. దానిలో ఉన్న పోషకాలు, ఔషధ గుణాలు గురించి తెలుసుకుందాం.

* మొదట బెల్లంలో ఎలాంటి రసాయనాలు దాదాపుగా కలవవు. అందుకే చక్కెరకు బదులుగా చక్కగా ఉపయోగించవచ్చు.
* బెల్లంలో ప్రోటీన్లు, ఫైబర్, మినరల్స్, కేలరీలు సంవృద్ధిగా ఉంటాయి. ఇందులో సుక్రోజ్ 50%, తేమ 20%, చక్కెర 20% ఉంటాయి.
* బరువు తగ్గడానికి కూడా బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది. ఆహారం సులభంగా జీర్ణం కావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రక్తాన్ని శుభ్రం చేస్తుంది. శరీరంలో విషపదార్దాలు, మలినాలు బయటకు పోయేలా చేస్తుంది.
* శరీరం నీరు పట్టకుండా లేదా పట్టినవారికి ఆ సమస్య నుండి బయటపడటానికి బెల్లం మంచి ఔషధం.
* బెల్లంలో ఉన్న విటమిన్స్, మినరల్ వంటివి జీవక్రియను మెరుగుపరుస్తాయి.
* బరువు తగ్గాలనుకునేవారు బెల్లంతో చేసిన స్వీట్స్, టీ వంటివి తీసుకోవాలి.

Related posts