భారత్‌లో బీఎమ్‌డబ్ల్యూ కార్లలోని ప్రధాన మోడళ్లు అమ్మకానికి సిద్ధమయ్యాయి. నేడు వీటిని మార్కెట్లోకి విడుదల చేశారు. బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ మొత్తం ఆరు వేరియంట్లలో లభ్యమవుతుంది. వీటి ధర రూ. 1.22 కోట్ల(ఎక్స్‌షోరూం) నుంచి రూ.2.42 కోట్ల మధ్యలో ఉంటుంది. అలాగే మరో మోడల్ ఎక్స్7 ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 98.90 లక్షలు. ఈ ఎక్స్7 మోడల్ బీఎమ్‌డబ్ల్యూలోని ఎస్‌యూవీ మోడళ్లలో ప్రధానమైనది. ఇదే మోడల్ భారతీయ కార్ల మార్కెట్లను ఆకట్టుకుంటుందని ఆ సంస్థ తెలుపుతోంది.
ఈ రెండు ప్రధాన మోడళ్లలో కొన్ని ఫీచర్లు ఒకేలా ఉండగా, సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ మాత్రం 7 సిరీస్‌లో వెడల్పుగా ఉండగా, ఎక్స్7లో పొడవుగా ఉంటుంది. 7 సిరీస్‌లో వేరియంట్స్ వరుసగా 730డీ ట్రిమ్(డీజిల్), 740ఎల్ఐ ట్రిమ్(పెట్రోల్), 745లే (ప్లగ్ ఇన్ హైబ్రిడ్), ఎమ్760ఎల్ఐలలో లభిస్తుంది. ఎక్స్7 మోడల్‌లో ఎక్స్‌డ్రైవ్ ఎమ్30డీ (డీజిల్), ఎక్స్‌డ్రైవ్ 40ఐ ట్రిమ్(పెట్రోల్)వేరియంట్లలో లభించనున్నాయి.
పండగలకు ప్రత్యేక రైళ్లు అంటూ.. బాదేస్తున్నారా..