telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

తన కేబినెట్లోని కొందరి పేర్లను వెల్లడించిన బైడెన్..

Joe Biden USA

ఈ మధ్యే జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ పై జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే . అయితే అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ మంత్రివర్గ కూర్పు దాదాపు పూర్తయింది. కేబినెట్లో కొందరి పేర్లను బైడెన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. అమెరికా భద్రత, విదేశీ వ్యవహారాల బృందాన్ని ప్రకటించారు. కీలకమైన విదేశీ వ్యవహారాల శాఖను ఆంటోనీ బ్లింకెన్‌ కు అప్పగించారు. అంతర్గత భద్రత మంత్రిగా ప్రముఖ న్యాయవాది అలెజాండ్ర మాయోర్కస్‌ ను ఎంపికచేశారు. ఈ పదవి చేపట్టనున్న తొలి లాటినో వ్యక్తి ఈయనే కావడం విశేషం. జాతీయ భద్రత సలహాదారుగా బైడెన్ సలహాదారుడు జేక్ సులివాన్‌ ను నియమించారు. సీఐఏ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అవ్రిల్ హేన్స్‌ ను జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌ గా ఎంపికచేశారు. సుదీర్ఘకాలం దౌత్యవేత్తగా పనిచేసిన లిండా థామస్ గ్రెన్‌ ఫీల్డ్‌ ను ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా నియమించారు. వీరంతా 2009-2017 మధ్య ఒబామా-బిడెన్ ప్రభుత్వంలో పనిచేసిన వారే కావడం విశేషం. చూడాలి మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పుడు వెలువడుతాయి అనేది.

Related posts