telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

తమ యాప్‌ల బ్యాన్ పై స్పందించిన చైనా…

apps play store

చైనాతో సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ తర్వాత పలు చైనా యాప్‌లపై వేటు వేసిన కేంద్ర ప్రభుత్వం మరో 43  చైనా మొబైల్ యాప్‌లను తాజాగా నిషేధించింది. మాంగో టీవీ, అలీసప్లయర్స్ మొబైల్ యాప్, అలీబాబా వర్క్‌బెంచ్, క్యామ్‌కార్డ్, అలీఎక్స్‌ప్రెస్ లాంటివి ఇందులో ఉన్నాయి. ఈ మేరకు సమాచార మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా కేంద్రం బ్లాక్ చేసిన ఒక రోజు తర్వాత చైనా స్పందించింది. భారతదేశం “జాతీయ భద్రతను ఒక సాకుగా ఉపయోగించుకోవడాన్ని” చైనా వ్యతిరేకిస్తున్నట్లు భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది. మీడియా అడిగిన ప్రశ్నకు గానూ ఈ సమాధానం ఇచ్చింది. పదే పదే ఇలాంటి మాటలను ఉపయోగించి యాప్స్ ని బ్యాన్ చేస్తున్నారు అని చైనా మండిపడింది. చైనా ప్రభుత్వం ఎల్లప్పుడూ విదేశీ చైనా కంపెనీలకు అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంటుంది అని చెప్పింది. చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా పని చేస్తుంది అని పేర్కొంది. అయితే ఆ సరిహద్దు వివాదం తర్వాత భారత ప్రజల్లో కూడా చైనా పై వ్యతిరేకత బాగా పెరిగిన విషయం తెలిసిందే.

Related posts