మెగా డాటర్ నిహారిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందన్న విషయం తెలిసిందే. ఈ లోపు వీలైనన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేయాలని భావిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక తాజాగా అభిమానులతో ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన పలు సరదా ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. “మీ ఫేస్ మీద పింపుల్ చూశా” అని ఓ నెటిజన్ కామెంట్‌కు స్పందించిన నిహారిక.. “కంగ్రాట్స్.. అవార్డు ఇంటికి పంపిస్తా” అని రిప్లై ఇచ్చింది. అలాగే “మీ ఫోన్ వాల్ పేపర్ ఏంటి? అని మరొకరు ప్రశ్నించగా.. కాబోయే భర్త చైతన్యతో దిగిన ఫొటోను వాల్ పేపర్‌గా పెట్టుకున్నానని తెలిపింది. అలాగే తమిళంలో ఓ సినిమా చేస్తున్నానని చెప్పింది.