telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

పిజ్జా డెలివరీ బాయ్‌ హేయమైన చర్యకు 18 ఏళ్ళ జైలు శిక్ష… ఏం చేశాడంటే ?

Pizza

హేయమైన చర్యకు పాల్పడిన పిజ్జా డెలివరీ బాయ్‌కు టర్కీ న్యాయస్థానం 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కస్టమర్‌ ఆర్డర్ చేసిన పిజ్జాను డెలివరీ చేయడానికి వెళ్లిన బాయ్.. వినియోగదారుడికి ఇచ్చే ముందు దానిలో ఉమ్మి ఇచ్చాడు. డెలివరీ బాయ్‌కు సంబంధించిన ఈ హేయమైన చర్య ఆ అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అపార్ట్‌మెంట్ యజమాని సెక్యూరిటీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్న క్రమంలో డెలివరీ బాయ్ చేసిన నిర్వాకం బయటపడింది. దాంతో యజమాని వెంటనే బాధితుడికి ఆ ఫుటేజీని చూపించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వీడియోలోని దృశ్యాల ఆధారంగా పోలీసులు ఈ చర్యకు పాల్పడిన సదరు డెలివరీ బాయ్‌ను బురక్‌గా గుర్తించారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే బురక్‌కు రూ.48వేల జరిమానా కూడా విధించారు. ఈ ఘటన 2017లో టర్కీలోని ఎస్కిసేహీర్ అనే ప్రాంతంలో జరిగింది. తాజాగా ఈ కేసు టర్కీ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో తన నేరాన్ని అంగీకరించిన డెలివరీ బాయ్‌కు కోర్టు 18 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.


Video Source: GoneViral

Related posts