ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పై రచ్చ కొనసాగుతుంది. అయితే ఇన్ని రోజులు ఏపీలో లోకల్ వార్ కాస్తా… ప్రభుత్వం వర్సెస్ ఈసీగా మారిపోయింది… ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటించింది ఏపీ ఎస్‌ఈసీ… ఇవాళ ఉదయే ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఏదేమైనా ఎన్నికలు వెళ్తామని ప్రకటించారు.. అయితే..మేం ఎవరినీ బెదిరించేలా వ్యాఖ్యలు చేయలేదని.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను బెదిరించాల్సిన అవసరం తనకు లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు.
నిఘా తన మీద కాదు.. నిమ్మగడ్డ మీద పెట్టాలని పోలీసులకు సూచించారు. ఎన్నికలకు సహకరించే వాళ్లతోనే పనిచేయించుకోండని.. మీ గొడవల్లో మేం బలి కావాలా..? అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులపై ఎందుకు కక్ష సాధింపు..? ఎస్‌ఈసీ ఉద్యోగులను టార్గెట్ చేస్తోందన్నారు. ఉద్యోగులను వాడుకుంటున్నది మీరు కాదా..? ఇద్దరు జిల్లా స్థాయి అధికారులపై కేసులు పెట్టింది టీడీపీ కాదా..? అని నిలదీశారు. ఇప్పుడు ఎన్నికలు జరపకుంటే వచ్చిన నష్టమేంటి..? ఉద్యోగుల అభ్యర్ధనను పరిశీలించండి అంటూ పార్టీలు ఈసీకి లేఖలు రాయాలన్నారు. ప్రభుత్వం, ఎస్‌ఈసీ పోరులో ఉద్యోగులు నలుగుతున్నారని.. ఉద్యోగులను ఉద్యోగులుగానే చూడండని సూచించారు వెంకట్రామిరెడ్డి.
previous post
next post