telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమిళనాట హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యల రచ్చ… మురుగన్ శక్తి ఏమిటో సమయమే చెప్తుందన్న లారెన్స్

raghava

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కరుప్పర్ కూట్టమ్ అనే సంస్థ వీడియోలను రిలీజ్ చేసిన ఘటన తమిళనాడులో వివాదంగా మారింది. హిందూ దేవతలపై విషం చిమ్ముతూ, వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వీడియోలు పెను దుమారంగా మారాయి. ఇప్పటికే అందుకు బాధ్యులైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో సినీ ప్రముఖులు పలువురు కరుప్పర్ కూట్టమ్ వీడియోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయంను తెలియజేస్తున్నారు. ఈ వివాదంపై లారెన్స్ స్పందిస్తూ… “వారి పేర్లను చెప్పడం వల్ల వారికి పబ్లిసిటీ కల్పించాలని కోరుకోవడం లేదు. ఆ సంస్థ తీరు దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో మురుగన్ భక్తులకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మురుగన్ శక్తి ఏమిటో సమయమే తెలియజేస్తుంది. వారికి ఖచ్చితంగా ప్రతిఫలం దక్కుతుంది. అప్పటి వరకు భక్తులు సహనంతో ఎదురు చూడాల్సిందే” అని లారెన్స్ అన్నాడు.

Related posts