telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

స్టోర్ లో దొంగతనం చేసిన యువతి… పిల్లాడిని అక్కడే మర్చిపోయింది…!!

Stole

స్నేహితురాళ్లతో కలిసి న్యూజెర్సీలోని ఓ షాప్‌కు వెళ్లిన ఆమె పిల్లాడి కోసం స్ట్రోలర్ కొట్టేయాలని అనుకుంది. తన స్నేహితురాళ్లు సేల్స్‌పర్సన్‌తో మాట్లాడుతుండగా… నెమ్మదిగా పక్కనే ఉన్న ఓ చిన్న స్ట్రోలర్‌ను తీసుకొని ఉడాయించింది. కానీ పిల్లాణ్ణి షాపులోనే మర్చిపోయింది. ఆ తర్వాత బాబు కోసం హడావుడిగా మళ్లీ అదే షాపుకు వెళ్లింది. అప్పుడు ఆ షాపు యజమాని ఆమెను పట్టేశాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. దొంగతనం చేసిన యువతిని, ఆమె స్నేహితురాలిని అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన స్ట్రోలర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన షాపు ఓనర్ ఎనీలియో ఓర్టెగా… “బతకడానికి దొంగతనం చేయాల్సిరావడం బాధాకరం. కానీ అది మీ వ్యక్తిగత విషయం. దానిపై నేనేమీ మాట్లాడను. కానీ ఇలా పిల్లల్ని షాపుల్లో వదిలేసి వెళ్లకండి. దాని వల్ల మాలాంటి షాపు ఓనర్లకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి” అంటూ పోస్ట్ చేశాడు. పిల్లల విషయంలో కొందరు తల్లులు ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో తెలియజేయాలనే ఈ వీడియో షేర్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Related posts