telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అమెరికాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు…

america

కరోనా కారణంగా చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి.  గతేడాది అమెరికా కరోనాతో అతలాకుతలం అయ్యింది.  గతేడాది రోజుకు లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవించాయి.  ప్రపంచంలో అత్యధిక కేసులు, మరణాలు నమోదైన దేశంగా అమెరికా ఉన్నది.  అయితే, కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.  దేశంలోకి అందరికి వ్యాక్సిన్ ను అందించడంలో అమెరికా సఫలం అయ్యింది.  100 రోజులు మాస్క్ ను తప్పనిసరి చేసింది.  అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో కొంతమేర కేసులు తగ్గుముఖం పట్టాయి.  ఇప్పుడు అమెరికాలో రోజువారీ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి.  అంతేకాదు, మరణాల సంఖ్యా కూడా తగ్గింది.  ఇప్పుడు అమెరికా కరోనా కోరల నుంచి బయటపడుతోంది.  మాస్క్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్న బైడెన్ కు అక్కడి ప్రజలు ఇప్పుడు కృతజ్ఞతలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు కరోనా సెగను ఎదుర్కుంటున్న భారత్ కు అమెరికా సహాయం చేయడానికి ముందుకు వస్తుంది.

Related posts