ఐదో వారం ఎలిమినేషన్‌లో రాహుల్,హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు ఉండగా.. ఈ ఏడుగురిలో ఇద్దరు సేవ్ అయ్యారు. నేటి ఎపిసోడ్‌లో ఒకరిని ఇంటి నుండి పంపించనున్నారు. ఇక శనివారం కావడంతో నాగ్ స్టన్నింగ్ ఎంట్రీ ఇచ్చాడు. శుక్రవారం హౌజ్‌లో ఏం జరిగిందో చూపించి ఇంటి సభ్యులకి ఓ సరదా గేమ్ పెట్టారు. ఈ గేమ్‌లో మిత్రుడు, శత్రువు,వెన్నుపోటు దారుడు ఎవరెవరో చెప్పాలని నాగ్ ఆదేశించడంతో ఇంటి సభ్యులు అందుకు తగ్గట్టు ముగ్గురిని ఎంపిక చేసుకున్నారు. వాటర్‌తో గేమ్స్ ఆడిన కారణంగా బిగ్ బాస్ హౌస్‌కి వాటర్‌ను ఆపేశారు. దీంతో శ్రీముఖి అధ్యక్షతన మహేష్, రాహుల్, శివజ్యోతి, బాబా భాస్కర్, అషూ, హిమజలు గుంజీలు తీసి మరీ బిగ్ బాస్‌కి సారీ చెప్పారు. ఆ తర్వాత శ్రీముఖి బిగ్ బాస్ హౌజ్ మూలలకి హిట్ కొట్టింది. దీంతో ఒక ఈగ చనిపోయింది. దీంతో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్.. ప్రగ్నెంట్‌తో ఉన్న ఈగని చంపేశావు. నీకు ఇదేమన్నా కరెక్టా అంటూ శ్రీముఖిపై బిగ్ బాస్‌కి ఫిర్యాదు చేశాడు. దాంతో.. శ్రీముఖి ఈగ మరణానికి సంతాపం ప్రకటిస్తూ నువ్వు స్వర్గంలో సుఖంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాంటూ చిన్నపాటి సంతాప సభ ఏర్పాటు చేసింది.
నాగార్జున ముందుగా బాబా భాస్కర్‌తో సంభాషణలు జరిపారు. ఈగకి సంతాప సభలు బాగానే జరిపారు. ఆడ ఈగ, మగ ఈగ ఎలా గుర్తుపడతావు చెప్పు అనగానే బాబా భాస్కర్ మూడో కంటితో చూసి చెప్పా అని అంటాడు. అందుకు నాగ్ కళ్ళ మధ్య దూరం ఉంటే ఫీమేల్, దగ్గరగా ఉంటే మేల్ అని వివరణ ఇస్తాడు. ఆ తర్వాత బాబా ఇంట్లో కన్నీళ్ళు పెట్టుకోవడం.. మహేష్, అలీ మధ్య గొడవ జరుగుతున్న సమయంలో ఆపే ప్రయత్నం చేయకపోవడం ఏం బాగోలేదు అంటూ దీనిపై చిన్నపాటి క్లాస్ పీకాడు నాగ్. అలీ రాజాకి అహంకారం ఎక్కువ. అందుకే అందరితో చాలా దురుసుగా ప్రవర్తిస్తావ్. కెప్టెన్‌గా ఉన్న శివజ్యోతికి నువ్వు కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఇలాంటి ప్రవర్తన మంచిది కాదు అని ఆయనకి హితవు పలికారు నాగ్. ఆ తర్వాత ఇంటి సభ్యులకి గేమ్ పెట్టారు. హౌజ్‌లో ఎవరికి ఎవరు మిత్రుడు, ఎవరు శత్రువు, ఎవరు వెన్నుపోటుదారుడు చెప్పాలని అనడంతో ముందుగా పునర్నవి రంగంలోకి దిగింది
1. పునర్నవి.. రాహుల్ (మిత్రుడు), శత్రువు (వరుణ్ సందేశ్), వితికా (వెన్నుపోటు దారుడు)
2. హిమజ.. శ్రీముఖి (మిత్రుడు), వితికా (శత్రువు), అషురెడ్డి (వెన్నుపోటు దారుడు)
3. మహేష్ విట్టా.. బాబా భాస్కర్ (మిత్రుడు), అలీ రజా (శత్రువు), వెన్నుపోటు (వెన్నుపోటు దారుడు)
4. వితికా.. పునర్నవి (మిత్రుడు), హిమజ (శత్రువు), రవిక్రిష్ణ (వెన్నుపోటు దారుడు)
5. రాహుల్.. పునర్నవి (మిత్రుడు), హిమజ (శత్రువు), రవిక్రిష్ణ (వెన్నుపోటు దారుడు)
6. అషురెడ్డి.. శివజ్యోతి (మిత్రుడు), బాబా భాస్కర్ (శత్రువు), హిమజ (వెన్నుపోటు దారుడు)
7. శ్రీముఖి.. రాహుల్ (మిత్రుడు), బాబా భాస్కర్ (శత్రువు), వితికా, పునర్నవి (వెన్నుపోటు దారుడు)
8. వరుణ్ సందేశ్.. మహేష్ (మిత్రుడు), వితికా (శత్రువు), పునర్నవి (వెన్నుపోటు దారుడు)
9. శివజ్యోతి.. అషు (మిత్రుడు), మహేష్ (శత్రువు), బాబా భాస్కర్ (వెన్నుపోటు దారుడు)
10. బాబా భాస్కర్.. శ్రీముఖి (మిత్రుడు), అలీ, మహేష్ (వెన్నుపోటు దారుడు). శత్రువు ఎవరూ లేరు.
11. రవిక్రిష్ణ.. శివజ్యోతి (మిత్రుడు), అలీ (శత్రువు), వితికా (వెన్నుపోటు దారుడు)
12. అలీ రజా.. శివజ్యోతి (మిత్రుడు), రవిక్రిష్ణ (శత్రువు), హిమజ (వెన్నుపోటు దారుడు)
పై విధంగా ఇంటి సభ్యులు శత్రువు, మిత్రుడు, వెన్నుపోటుదారులని ఎంపిక చేసుకొని అందుకు గల కారణాలు కూడా వివరించారు. ఈ వారం ఎలిమినేష్ నుండి మహేష్, శివజ్యోతి సేవ్ అయినట్టు నాగ్ చెప్పడంతో వారి ఆనందం అవధులు దాటింది. ప్రస్తుతం ఎలిమినేషన్‌లో రాహుల్,హిమజ, అషు, పునర్నవి, బాబా భాస్కర్‌లు ఉండగా.. వీరిలో ఎవరు ఇంటి నుండి వెళ్ళనున్నారో తెలియాలంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే.
చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్…