telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మంచు లక్ష్మీ కూతురి బర్త్ డే… ప్రభాస్ సర్ప్రైజ్.. !!

Manchu Lakshmi

మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ మంగళవారం ఆరో పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా విద్య గురించి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్‌లు చేశారు. “నువ్వు నా జీవితంలోనే కాదు.. నా వాళ్ల జీవితాల్లో కూడా ఆనందం నింపావు. అమితమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలిపినందుకు ధన్యవాదాలు. నువ్వే నా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. హ్యాపీ బర్త్‌డే విద్యా నిర్వాణ. నువ్వు జీవితంలో కావాలనుకున్న ప్రతిదాన్ని సాధించాలని కోరుకుంటున్నా” అంటూ మంచు లక్ష్మి పేర్కొన్నారు. ఇక ఇతర సినీ ప్రముఖులు కూడా విద్యకు విషెస్ తెలియజేశారు. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్.. విద్య కోసం వీడియో కాల్ చేశాడట. విద్యతో చాలా సేపు మాట్లాడాడట. ఈ విషయాన్ని మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అలాగే హీరోయిన్ రకుల్ ప్రీత్ కూడా విద్యకు విషెస్ తెలియజేసింది. “ఈ చిన్నారికి అప్పుడే ఆరేళ్లు నిండాయంటే నమ్మలేకపోతున్నా. నా చిట్టి యువరాణికి హ్యాపీ బర్త్‌డే” అంటూ విష్ చేసింది.

Related posts