telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రష్యా అధ్యక్షుడు…

Russian President Putin

చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే రష్యాలో కరోనా కేసులు రోజు రోజుకు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి.  ఇప్పటికే రష్యా కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ని తయారు చేసింది.  ఆ దేశంలో 3 లక్షల మందికి వ్యాక్సిన్ ను అందించారు.  గతంలో 18 నుంచి 60 సంవత్సరాల వయసు లోపున్న వ్యక్తులకు మాత్రమే వ్యాక్సిన్ ను అందించారు.  60 సంవత్సరాలు దాటిన వారికీ కూడా వ్యాక్సిన్ అందించేందుకు రష్యా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  దీంతో 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు సోమవారం నుంచి వ్యాక్సిన్ అందించబోతున్నారు.  ఇందులో భాగంగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వ్యాక్సిన్ తీసుకోబోతున్నారు.  సోమవారం రోజున అధ్యక్షుడు పుతిన్ వ్యాక్సిన్ తీసుకోబోతున్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు.  రష్యా అధ్యక్షుడు కూడా టీకా తీసుకోబోతుండటంతో టీకాపై మరింత నమ్మకం పెరిగింది.  ఇప్పటికే అనేక దేశాలు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ టీకాలకు ఆర్డర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ వ్యాక్సిన్ మన దేశంలోకి ఎప్పుడు వస్తుంది అనేది.

Related posts