telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మద్యపాన నిషేధం ఒకేసారి సాధ్యం కాదు: మంత్రి నారాయణస్వామి

Narayana swamy Minister

మద్యపాన నిషేధం ఒకేసారి సాధ్యంకాదని ఏపీ అబ్కారీ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు.  దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామని తెలిపారు. గుంటూరులోని రోడ్లు, భవనాల శాఖ గెస్ట్ హౌస్ లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం మద్యం బెల్టు షాపుల నివారణకు శ్రమిస్తున్నామని అన్నారు.

మద్యపాన నిషేధానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాటుసారా కాసే కూలీలపై కాకుండా యజమానులపై కేసులు పెడతామని హెచ్చరించారు. గతంలో ఎన్టీఆర్ కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేశారని, గుర్తు చేస్శారు. తమ ప్రభుత్వం కూడా మద్యాన్ని ఆదాయ మార్గంగా చూడడంలేదని స్పష్టం చేశారు.మద్యపానంతో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని అన్నారు. అక్టోబరు నుంచి రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ మద్యం దుకాణాలుఅందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

Related posts