telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ అభ్యర్దే హైదరాబాద్ మేయర్: అమిత్‌ షా

Amit Shah

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ఈరోజుతో ముగియనున్న సంగతి తెలిసిందే.  ఈరోజు బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గ్రేటర్ హైదరాబాద్ కు వచ్చారు.  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  అనంతరం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసారు.  హైదరాబాద్ ప్రజలకు అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు.  జీహెచ్ఎంసి పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని అన్నారు. ఎక్కడికి వెళ్లినా బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.  బీజేపీకి అవకాశం ఇస్తే అక్రమ కట్టడాలన్నీ కూల్చివేస్తామని అన్నారు.  ఇక కేసీఆర్ ఇంటిపక్కనే కూడా నీళ్లు నిలిచిపోయాయని తెలిపారు.  తాను అడిగే ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు.  ఎన్నికల తరువాత వంద రోజుల ప్లాన్ అన్నారని, ఆ ప్లాన్ ఏమైందో చెప్పాలని అన్నారు.  లక్ష ఇల్లు కట్టిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేవలం 11 వేలకు మించి ఇల్లు నిర్మించలేదని అన్నారు.  హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, గాంధీ ఉస్మానియా తరహాలో మరో నాలుగు ఆసుపత్రులను నిర్మిస్తామని చెప్పారని, కానీ, అది ఏమైందో ఇప్పటి వరకు తెలియదని అన్నారు.  హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే రూ. 4500 కోట్లు ఇచ్చామని అమిత్ షా పేర్కొన్నారు.  ప్రపంచం మొత్తం ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పటికీ విదేశీ పెట్టుబడులు ఇండియాకు వచ్చాయని, మోడీ విధానాల వలన హైదరాబాద్ కు పలు విదేశీ సంస్థలు వచ్చాయని అమిత్ షా పేర్కొన్నారు.  హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందని, బీజేపీ అభ్యర్థి మేయర్ అవుతాడని అమిత్ షా పేర్కొన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts