telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్దం… పూర్తి వివరాలు ఇవే..

AP Local Body Elections 2020 Reservation List Finalaized

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్దమైంది. ఈ నెల 17వ తేదీన మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, అదే రోజున కౌంటింగ్‌ జరుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 20 డివిజన్లల్లోని 160 మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. మూడో విడతలో 3,221 పంచాయతీలున్నాయి. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా 579 పంచాయతీలు ఏకగ్రీవాలు పోనూ 2,640 పంచాయతీల్లో మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. మూడో విడతలో సర్పంచ్‌ పదవులకు 7,756 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

శ్రీకాకుళం: డివిజన్లు(02): పాలకొండ, శ్రీకాకుళం
మండలాలు(09): ఆముదాలవలస, బుర్జ, పొందూరు, సరుబుజ్జి, భామిని, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, రేగిడి ఆముదాలవలస.
ఏకగ్రీవాలు:
సర్పంచులు: 45, వార్డు మెంబర్లు: 938
ఎన్నికలు:
సర్పంచులు: 248 , వార్డు మెంబర్లు: 1706
విజయనగరం:
డివిజన్లు(01): విజయనగరం
మండలాలు(09): భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, మెరకముడిదాం, నెల్లిమర్ల, పూసపాటి రేగ, విజయనగరం.
ఏకగ్రీవాలు:
సర్పంచులు: 37, వార్డు మెంబర్లు: 598
ఎన్నికలు:
సర్పంచులు: 207, వార్డు మెంబర్లు: 1732
విశాఖ:
డివిజన్లు(01): పాడేరు
మండలాలు(11): అనంతగిరి, అరకు వ్యాలీ, చింతపల్లి, డుంబ్రీగూడ, జి.మాడుగుల, జీకే వీధి, హుకూం పేట, కొయ్యూరు, ముంచింగిపుట్టు, పాడేరు, పెదబయలు.
ఏకగ్రీవాలు:
సర్పంచులు: 6, వార్డు మెంబర్లు: 893
ఎన్నికలు:
సర్పంచులు: 237, వార్డు మెంబర్లు: 1497

తూ.గో:
డివిజన్లు(02): రంపచోడవరం, ఎటపాక.
మండలాలు(11): అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, మారేడుమిల్లి, రంపచోడవరం, రాజవొమ్మంగి, వై. రామవరం, చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఎటపాక.
ఏకగ్రీవాలు:
సర్పంచులు: 14, వార్డు మెంబర్లు: 448
ఎన్నికలు:
సర్పంచులు: 172, వార్డు మెంబర్లు: 1271

ప.గో:
డివిజన్లు(03): జంగారెడ్డి గూడెం, కుక్కునూరు, ఏలూరు
ఏకగ్రీవాలు:
సర్పంచులు: 14, వార్డు మెంబర్లు: 371
ఎన్నికలు:
సర్పంచులు: 164, వార్డు మెంబర్లు: 1519

మూడో విడత పంచాయతీ ఎన్నికల వివరాలు:
కృష్ణా:
డివిజన్లు(01): మచిలీపట్నం
మండలాలు(12): అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, ఘంటసాల, గుడూరు, కోడూరు, కృత్తివెన్ను, మచిలీపట్నం, మోపిదేవి, మొవ్వ, నాగాయలంక, పెడన.
ఏకగ్రీవాలు:
సర్పంచులు: 29, వార్డు మెంబర్లు: 750
ఎన్నికలు:
సర్పంచులు: 196, వార్డు మెంబర్లు: 1441

Related posts