telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేశారు: సీఎం జగన్

jagan on ap assembly sessions

ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేశారని ఏపీ సీఎం జగన్ అన్నారు. నిన్న శాసనమండలిలో జరిగిన పరిణామాలు తన మనసును ఎంతగానో బాధించాయని చెప్పారు. ఈ రోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 86 శాతం ఓట్లతో తాము గెలిచామని అన్నారు. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఏర్పడ్డ సభ అని, చట్టాలు చేయడానికి ఏర్పాటైన సభ అని అన్నారు. మండలి అనేది చట్టసభలో భాగం కనుక చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మామని, తన నమ్మకంతో పాటు ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు.

శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిష్పక్షపాతంగా సభను నిర్వహించే పరిస్థితి లేదని అన్నారు. నిన్న గ్యాలరీలో చంద్రబాబు కూర్చుని జారీ చేసిన ఆదేశాలను చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమౌతుందని విమర్శించారు. శాసనసభ పంపిన వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చించి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చని, లేకపోతే, సవరణలు కోరుతూ తిప్పి పంపించవచ్చు అని, చట్టం కూడా ఇదే విషయాన్ని చెబుతోందని అన్నారు. కానీ, వాటిని లెక్క చేయకుండా విచక్షణా అధికారం అంటూ కౌన్సిల్ చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారని విమర్శించారు.

Related posts