telugu navyamedia
రాజకీయ వార్తలు

షరీఫ్ నిర్ణయం వెనుక చంద్రబాబు: కొడాలి నాని

kodali nani ycp

నిన్న శాసనమండలిలో చైర్మెన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం వెనుక చంద్రబాబు ఉన్నారని ఏపీ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఇవాళ ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మంత్రి సెటైర్లు విసిరారు. ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను అని, అన్నేళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబునాయుడు సీఎం జగన్ దెబ్బకు గ్యాలరీ ఎక్కారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అసెంబ్లీలో గ్యాలరీకి చంద్రబాబు వెళ్లేలా చేయాలంటూ జగన్ ని కోరుతూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ సభ్యులు బల్లలు చరుస్తూ నవ్వులు చిందించారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ షరీఫ్ పైనా కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. ముప్పై ఏడు ఏళ్లుగా షరీఫ్ తనకు తెలుసని, టీడీపీకి ఆయన చాలా సిన్సియర్ కార్యకర్త అంటూనే నిన్న ఆయన తీసుకున్న నిర్ణయంపై విమర్శలు చేశారు. ఈ విషయంలో షరీఫ్ ను అనేందుకు ఏమీ లేదని ఆ నిర్ణయం వెనుక చంద్రబాబు ఉన్నారని పేర్కొన్నారు.

Related posts