telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీటీడీ పాలక మండలిలో ఆంధ్రోళ్ళకు మొండిచేయి!

cm jagan on govt school standardization

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ ) పాలకమండలి సభ్యుల విషయంలో ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రోళ్లు ఖంగు తినెలా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఏ ఒక్క ఆంధ్రోడికి పదవి ఇచ్చింది లేదు. కానీ జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ సంచలన నిర్ణయం తెస్సుకున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో నివాసం ఉంటున్న ఆంధ్ర వాళ్ళ విషయంలో అంతులేని వివక్షను ప్రదర్శిస్తున్న పరిస్థితుల్లో భిన్నంగా టీటీడీలో పాలకమండలి సభ్యుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం నోట మాట రాకుండా చేస్తోంది. ఆంధ్రా మూలాలు ఉన్న లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఆంధ్రోడు విమర్శిస్తారా? ఇక్కడి విషయాలు ఆయనకేం పని అన్నట్లుగా మాట్లాడిన కేసీఆర్ మాట్లాడిన విషయం విధితమే.

టీడీలో ఆంధ్రాకు తెలంగాణకు మధ్య వ్యత్యాసం ఒకే ఒక్క సభ్యుడే కావటం విస్మయానికి గురి చేస్తోంది. గత ప్రభుత్వంలో 18 మంది ఉన్న పాలకమండలిని ఏకంగా 28 మందిని చేశారు. అందులో 8 మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఉండగా.. వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురికి మండలిలో చోటు కల్పించటం హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురిని పాలక మండలిలో ఎలా చోటు కల్పిస్తారన్న ప్రశ్నకు జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని పలువురు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం పరిశీలిస్తే మొత్తం మండలిలోని 28 మంది సభ్యుల్లో.. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న నలుగురిని మినహాయిస్తే 24 మంది ఉంటారు. వారిలో 1/3వంతు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఉంటే.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారంతా కలిపి 2/3 వంతు ఉండటం విశేషం. మరెక్కడా లేని రీతిలో వ్యవహరించిన జగన్ తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. జగన్ కు ఓట్లు వేసింది ఆంధ్రోళ్లే తప్పించి తెలంగాణ.. తమిళులు.. కన్నడిగులు.. మరాఠీలు కాదన్న విషయాన్ని ఏపీ సీఎం ఎలా మర్చిపోయారన్నదాని పై విమర్శలు వెళ్లువిరుస్తున్నాయి.

సీఎం జగన్ ఖరారు చేసిన టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితా :

ఆంధ్రప్రదేశ్
1. యువి రమణ మూర్తి (ఎమ్మెల్యే)
2. వి.ప్రశాంతి
3. మల్లికార్జున రెడ్డి (ఎమ్మెల్యే)
4. గొల్ల బాబూరావు (ఎమ్మెల్యే)
5. కె.పార్థసారథి (ఎమ్మెల్యే)
6. డిపి అనంత
7. చిప్పగిరి ప్రసాద్ కుమార్
8. నాదెండ్ల సుబ్బారావు
తెలంగాణ
1. జె.రామేశ్వరరావు
2. బి.పార్థసారథి రెడ్డి
3. యు.వెంకట భాస్కర రావు
4. మూరంశెట్టి రాములు
5. డి.దామోదర్ రావు
6. కె.శివ కుమార్
7. పుట్టా ప్రతాపరెడ్డి
తమిళనాడు
1. కుమారగురు (ఎమ్మెల్యే)
2. ఎస్.శ్రీనివాసన్
3. డాక్టర్ నిచితా ముత్తువరపు
4. కృష్ణమూర్తి వైద్యనాథన్
కర్ణాటక
1. రమేష్ శెట్టి
2. సంపత్ రవి నారాయణ
3. సుధా నారాయణ మూర్తి
ఢిల్లీ
1. ఎం ఎస్ శివ శంకరన్
మహారాష్ట్ర
1. రాజేష్ శర్మ
ఎక్స్ అఫీషియో సభ్యులు
1. చైర్మన్ (టీయూడీఏ)
2. స్పెషల్ సీఎస్
3. కమిషనర్ ఎండోమెంట్స్
4. టీటీడీ ఈవో

Related posts