telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అఖిలపక్ష భేటీకి హాజరైన వైసీపీ ఎంపీలు

Vijayasai reddy ycp

ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైసీపీ ఎంపీలు హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.18,969 కోట్ల రెవెన్యూ లోటు నిధులను అడిగామని తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి సాయం కింద రావాల్సిన రూ.23,300 కోట్ల నిధుల విషయాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా అఖిలపక్ష సమావేశంలో అనేక అంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, ఇప్పటికే ఈ ప్రాజెక్టు జాతీయ హోదా దక్కించుకుంది కాబట్టి, దానికి కేంద్రం నుంచి రూ.3,283 కోట్లు రీయింబర్స్ మెంట్ రూపంలో రావాల్సి ఉందని తెలిపామని వెల్లడించారు. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లను కేంద్రం ఆమోదించాలని కోరామని తెలిపారు.

Related posts