వర్షాలు దంచికొడుతున్నాయి… ముఖ్యంగా తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇక, సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ ఇసుకబావి వద్ద మురుగు కాలువపై కారు కొట్టుకుపోయిన ఘటన అందరికి తెలుసు. అయితే ఆ కారు వెతికి తీయడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో తనిఖీ చేస్తున్నారు. మూడు రోజుల నుంచి సెర్చ్ ఆపరేషన్ జరుతుంది. ఈరోజు ఏదైనా ఫలితం ఉండొచ్చని ఆర్డీవో నగేష్ చెబుతున్నారు. ఆ గల్లంతైన వ్యక్తి పేరు అనంత్ ఆనంద్ (30) గా గుర్తించారు. అతనికి భార్య ఒక పాప ఉన్నారు. అయితే ఆ పాప రెండో పుట్టిన ఈ రోజు. అలాగే అతని భార్య ఐదో నెల గర్భిణీ. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం కూడా అతను రాత్రి పని చూసుకుని.. ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది జరుగునట్లు తెలుస్తుంది. ఆ రోజు నుండి ఇప్పటివరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతడిని వెతుకుతూనే ఉన్నాయి. కానీ ఫలితం లేదు.