పాకిస్థాన్ మరోసారి సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. జమ్మూకశ్మీర్ లోని నియంత్రణ రేఖ రాజౌరీ సెక్టార్లలో భారత ఆర్మీ పోస్టులు లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పాక్ అకస్మాత్తుగా చేసిన ఈ దాడిలో భారత సైన్యానికి చెందిన లాన్స్ నాయక్ సందీప్ థాపా ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు పాక్ కాల్పులను దీటుగా తిప్పికొడుతున్నాయి.
ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 6.30 గంటలకు పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని తెలిపారు. తేలికపాటి ఆయుధాలు, షెల్స్ ను పాక్ ప్రయోగిస్తోందని వెల్లడించారు. పాక్ దాడిని భారత బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయని పేర్కొన్నారు. భారత బలగాలు ఇటీవల జరిపిన కాల్పుల్లో నలుగురు పాక్ రేంజర్లు చనిపోయారు. ఆ దాడికి ప్రతీకారంగానే పాక్ తాజాగా కాల్పులకు పాల్పడిందని తెలిపారు.
ఆ విషయం అసంతృప్తి కలిగించింది : నీతి ఆయోగ్