telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒట్టు పొరపాటున ‘పవర్ స్టార్’కి లైక్ కొట్టా… క్షమించండి : బండ్ల గణేష్

bandla ganesh in bigg boss 3 conditions apply

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అడ్డంగా బుక్ అయిపోయాడు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న’ పవర్ స్టార్ ‘ సినిమా వీడియోకు ఆయన ట్విట్టర్ లో లైక్ కొట్టడంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ పై విమర్శలు చేస్తున్నారు. వర్మ ‘పవర్ స్టార్ ‘ సినిమాను పవన్ కు వ్యతిరేకంగా తెరకెక్కిస్తున్నారని ఫ్యాన్స్ వర్మతో కయ్యానికి దిగిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా వర్మకు పవన్ ఫ్యాన్స్ కి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ‘ పవర్ స్టార్ ‘ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా వర్మ కొద్ది రోజులుగా టీజర్లు, టైలర్లు, వీడియోలు యూట్యూబ్, ట్విట్టర్ ద్వారా వరుసగా విడుదల చేస్తున్నాడు. పవన్, చిరంజీవి పోలికలతో ఉన్న ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న వీడియోకి బండ్ల గణేష్ లైక్ కొట్టాడు. ఆ వీడియో ‘పవర్ స్టార్ ‘ సినిమా లోనిది. ఇది గమనించిన ఓ పవన్ అభిమాని ‘బండ్ల అన్నా ఈ వీడియోను ఎందుకు లైక్ చేసావ్?’ అని అడిగాడు. దీనికి స్పందించిన బండ్లగణేష్ ‘ఒట్టు పొరపాటున లైక్ కొట్టా.. క్షమించండి..’ అని బదులిచ్చాడు. పవన్ కు నేను పెద్ద ఫ్యాన్ ను, ఆయన నాకు దేవుడని, నిర్మాతగా నాకు జీవితాన్ని ఇచ్చారని ఏ స్టేజ్ ఎక్కినా పవన్ ను పొగిడే బండ్ల గణేష్ పవన్ కు వ్యతిరేకంగా వర్మ తీసిన సినిమా వీడియోకు లైక్ కొట్టడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అభిమానివై ఉండి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు.

Related posts