telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రేణూదేశాయ్ వెబ్ సిరీస్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్

renudesai with dengue photo viral

నటిగా, దర్శకురాలిగా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రేణుదేశాయ్. బద్రి, జాని వంటి సినిమాల్లో నటించి ఫేమ్ అయింది. ఆ తర్వాత ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను నిర్మించి నిర్మాతగా మారింది. పవన్ కళ్యాణ్ నటించిన కొన్ని సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పనిచేసింది. రేణు దేశాయ్ ఇటీవలే తన రీఎంట్రీ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది. ఇప్పుడు రేణు దేశాయ్ ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమయ్యారు. వచ్చే నెలలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు అవుతుంది.ఈ వెబ్‌ సిరీస్‌కి ఎమ్‌ఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్నారు. డీఎస్ రావు, ఎస్ రజనీకాంత్ నిర్మిస్తున్నారు. దాశరధి సివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.ఒక మహిళ సత్యాన్వేషణ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ.. ఆమెకు సంబంధించిన ఇబ్బందులను ఎలా అధిగమించింది అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారట. కాగా ఈ వెబ్ సిరీస్ కు “ఆద్య” అనే టైటిల్ ను అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్.. రేణు దేశాయ్ ల కూతురు పేరు ఆద్య అనే విషయం తెల్సిందే.ఇప్పుడు ఈ టాపిక్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ హా మారింది. మరోవైపు రైతులపై సినిమా తెరకెక్కించాలని చూస్తున్నారు రేణు దేశాయ్.

Related posts