telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎట్టకేలకు ఎర్రకోటపై జెండా ఎగురవేసిన రైతులు

గణతంత్ర దినోత్సవం రోజునే ఢిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు రైతులు.. దీంతో.. రాజధానిలో వేల సంఖ్యలో బలగాలను మోహరించారు. ఒక్క రాజ్‌పథ్‌లోనే 6 వేల మంది సాయుధ పోలీసుల్ని దించారు. ర్యాలీకి లక్షల సంఖ్యలో ట్రాక్టర్లు తరలించాలని భావించినా… కేవలం ఐదు వేల ట్రాక్టర్లకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.  అయితే…ఈ ట్రాక్టర్‌ ర్యాలీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎర్రకోటను ముట్టడించింది. ఎర్రకోట బురుజుల పైకి చేరి ఫ్లాగ్‌ పోల్‌పై జెండాలు ఎగురవేశారు రైతులు. రిపబ్లిక్‌ డే పరేడ్‌ కంటే ముందే… ఉదయం ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టిన రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోకి వివిధ ప్రాంతాల నుంచి అడుగుపెట్టారు. అయితే… రైతులు చట్టాలను ఉల్లంఘించకుండా సంయమనం పాటించాలని…. పోలీసుల పై దాడులు, విధ్వంసం సృష్టించవద్దని ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తి చేశారు. కానీ ఢిల్లీలోని ముకర్బా చౌక్ వద్ద రైతులపై బాష్పవాయువును ఉపయోగించారు పోలీసులు. బారికేడ్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నించడంతో పాటు ట్రాక్టర్లతో సిమెంటు దిమ్మలను తొలగించే ప్రయత్నం చేసారు యువ రైతులు. కొన్ని చోట్ల ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న రైతులపై పూల రెక్కలు చల్లి స్వాగతం చెప్పి, మద్దతు తెలిపారు ఢిల్లీ ప్రజలు.

Related posts