telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రంగ్ దే”కు ఓటిటి భారీ ఆఫర్స్… ఆలోచనలోపడ్డ నిర్మాతలు ?

Rangde

యంగ్ హీరో నితిన్ ఇటీవల ‘భీష్మ’ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా పట్టాలెక్కించాడు నితిన్. ‘మహానటి’ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలనీ నిర్మాతలు భావిస్తున్నారని గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ మూలంగా థియేటర్లు మూతబడడంతో, పూర్తయిన సినిమాలు కూడా కొన్ని విడుదల కాకుండా ఆగిపోయాయి. ఇలాంటి చిత్రాల నిర్మాతలకు ఓటీటీ మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. పైగా ఓటీటీ ప్లేయర్స్ మంచి రేటును కూడా ఆఫర్ చేస్తున్నాయి. కాని హీరో నితిన్ మాత్రం ఇంకా ఓటీటీ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ”రంగ్ దే” సినిమాను ఓటీటీలో విడుదల చేసే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇదే సమయంలో ప్రముఖ ఓటీటీ ల నుండి ఈ సినిమాకు భారీ ఆఫర్స్ వస్తున్నాయట. వచ్చే నెల నుండి థియేటర్లు ఓపెన్ అయితే నవంబర్ లేదా డిసెంబర్ లో సినిమాను థియేటర్లలోనే విడుదల చేద్దాం లేదంటే అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిద్దాం అని చిత్రయూనిట్ భావిస్తోందట.

Related posts