telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

మరో విజయాన్ని సొంతం చేసుకున్న.. ఇస్రో..

isro successfully launched another satellite

ఇస్రో మరో భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపింది. శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి.. ఏరియన్‌-5 వాహకనౌక ద్వారా.. జీశాట్‌-30 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించింది. 38 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి చేరడంతో.. పరీక్ష విజయవంతమైంది. ఈ ఉపగ్రహం బరువు 3357 కిలోలు.. కాగా ఇది ఓ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. ఇన్‌సాట్‌-4ఏ ఉపగ్రహానికి బదులుగా ఈ జీషాట్-30 సేవలను అందించనుంది. దీని ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. టెలివిజన్, టెలీ కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ సేవలే లక్ష్యంగా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. భారత్‌కు చెందిన శక్తివంతమైన సమాచార ఉపగ్రహం.. జీశాట్‌-30 ప్రయోగం విజయవంతమైనట్లుగా ఇస్రో తన అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

Related posts