ఏపీలో చంద్రబాబుకు పట్టిన గతే తెలంగాణలో కేసీఆర్‌కు పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందంటూ సీపీఐ నేతలు హైదరాబాద్ లో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రజలు నమ్మకంతో గెలిపిస్తే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకవేళ ఎవరైనా తమ పార్టీలోకి వస్తే పదవులకు రాజీనామా చేసి రావాలన్న ఏపీ సీఎం జగన్‌ను చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ విలువలు నేర్చుకోవాలని నారాయణ సూచించారు.
ఎంఐఎం ప్రతిపక్షం అయితే ప్రజలకు ఒరిగేదేం లేదని నారాయణ అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుల్ని నిరసిస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీ అజీజ్ పాషా తదితరులు నిరసనకు దిగారు. పశ్చిమ బెంగాల్‌లో మమత సర్కార్‌ను లేకుండా చేయాలని బీజీపీ చూస్తోందని మండిపడ్డారు. ఏఐటీయూసీ కార్యాలయం నుంచి నిరసన ప్రదర్శన చేపట్టిన సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
ఏపీ సీఎం పై జేపీ నేత లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు…