telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నిజాలను దాచిపెడితే పెనుప్రమాదం: చంద్రబాబు

chandrababu

కరోనా వైరస్ వ్యాధి సోకినవారి వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజాలను దాస్తున్నట్టుగా అనుమానం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విషయంలో నిజాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరుతూ సీఎం జగన్ కు ఆయన ఓ లేఖను రాశారు. తక్కువగా చూపుతున్నారన్న భావన ప్రజల్లో ఉంది. నిజాలను దాచిపెడితే పెనుప్రమాదం తప్పదు” అని తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని కరోనా పాజిటివ్‌ కేసులను బయట పెట్టడంలేదు. కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రాంతాల్లో వైరస్ కారణంగా చనిపోయినా ప్రభుత్వం బయటకు చెప్పడం లేదన్న వార్తలు వస్తున్నాయి. వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనికోసం వైద్య పరీక్షలు పెంచాలని, పాజిటివ్‌ కేసులను గుర్తించి, సమస్య జటిలం కాకుండా చూడాలని ఆయన సలహా ఇచ్చారు.

వైరస్ సోకిన వారిని ప్రజల నుంచి వేరు చేసి ప్రత్యేకంగా చికిత్సలు చేయించాలని చంద్రబాబు తన లేఖలో సూచించారు. ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, పేదలకు పౌష్టికాహారం కోసం అన్న క్యాంటీన్లను వినియోగించాలని కోరారు.
కేంద్రం ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీని వినియోగించుకుని, మూడు నెలలకు సరిపడా రేషన్‌, పింఛన్‌ ఒకేసారి పంపిణీ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Related posts