telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లేడీ ఓరియెంటెడ్ కథలకు కేరాఫ్ అడ్రస్ గా సమంత అక్కినేని

Samantha

లేడీ ఓరియెంటెడ్ పాత్రలు సమంత అక్కినేని కోసం క్యూ కడుతున్నాయి యూ టర్న్, ఓ బేబీ లాంటి సినిమాలతో తనను తాను నిరూపించుకుంది సమంత. దాంతో ఈమెతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఓ బయోపిక్‌లో సమంత నటించేందుకు సిద్దమవుతోందని ప్రచారం జరుగుతుంది. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, బెంగళూరు నాగరత్నమ్మ జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ క్రమంలోనే నాగరత్నమ్మ పాత్ర కోసం సమంతను తీసుకుంటున్నారు. దేవదాసీగా పుట్టి సంగీత కళాకారిణిగా ఎదిగి జీవిత చరమాంకంలో యోగినిగా మారింది నాగరత్నమ్మ.

Related posts