భారత జట్టు ఓ పడి లేచే కెరటం లాంటిదని భారత ప్రధాన కోచ్ రవి శాస్త్రి అన్నారు. అయితే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ కోల్పోయి తర్వాత యూదు మ్యాచ్ లు భారత్ వరుసగా గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకముందు ఆసీస్ లో కూడా అలాగే అయ్యింది. దీని పై రవి శాస్త్రి మాట్లాడుతూ… ‘ప్రస్తుత జట్టు గెలవడాన్ని గర్వంగా భావిస్తోంది. ఒక్కోసారి ఓటములు ఎదురైనా.. దిగులు పడట్లేదు. మళ్లీ సానుకూల ఫలితం వచ్చే వరకు ఓపిగ్గా ఎదురుచూస్తోంది. ఆరు నెలలు ఆటగాళ్లు లాక్‌డౌన్‌లో గడిపిన సంగతి మాకు తెలుసు. అందుకే వారికి కుదురుకునే సమయం కావాలని అప్పుడే అనుకున్నాం. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు వన్డేల్లో ఓడిన తర్వాత మూడో వన్డేలో విజయం అలానే వచ్చింది. ఈ గెలుపు తర్వాత భారత్ వెనక్కి తిరిగిచూడలేదు. టీ20లతో పాటు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలుచుకుంది. తాజాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడినా.. ఆ తర్వాత మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది’ అని భారత కోచ్ చెప్పుకోచ్చాడు. ఇక ప్రస్తుతం భారత జట్టు నేడు ఇంగ్లాండ్ తో తొలి టీ 20 మ్యాచ్ ఆడనుంది. చూడాలి మరి ఇందులో ఏం జరుగుతుంది అనేది.
previous post
next post